పొన్నూరులో అన్నదాన కార్యక్రమం

పొన్నూరులోని రైలుపేట 9వ వార్డు కళింగమర్దన అవతార వినాయక మండపంలో వినాయక చవితి సందర్భంగా మధ్యాహ్నం 12:30 గంటలకు అన్నదాన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సుఖవాసి సుధీర్ పాల్గొన్నారు. భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలు వడ్డించారు. అనేక మంది భక్తులు వినాయక స్వామిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. అన్నదానంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ రెల్లి కమిటీ ధన్యవాదాలు తెలిపింది.

సంబంధిత పోస్ట్