ప్రత్తిపాడు: అభినేని గుంట పాలెం పిఎసిఎస్ చైర్మన్గా పార్వతి

పెదనందిపాడు మండలం అబ్బినేనిగుంటపాలెం పిఎసిఎస్ చైర్మన్గా స్వయంపు పార్వతి ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పాల్గొని, రైతులకు అందుబాటులో ఉంటూ పిఎసిఎస్ అభివృద్ధికి కృషి చేయాలని పార్వతితో పాటు సభ్యులను ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, పిఎసిఎస్ అధికారులు హాజరయ్యారు. అనంతరం నేతలు చైర్మన్ పార్వతిని అభినందించారు.

సంబంధిత పోస్ట్