అద్దంకి నుండి రేణింగివరం వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న లోతైన గుంత ప్రమాదకరంగా మారిందని పలువురు ప్రయాణికులు బుధవారం ఆరోపించారు. రాత్రి వేళల్లో ఈ గుంత కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని, ఆర్ అండ్ బి అధికారులు మాత్రం ఎటువంటి చలనం చూపడం లేదని వారు వాపోయారు. ఇప్పటికైనా స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.