విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాల మేరకు, అద్దంకి పట్టణంలోని వ్యాపార సముదాయాలలో విద్యుత్ శాఖ అధికారులు ట్రూడౌన్ చార్జీల తగ్గింపుపై అవగాహన కల్పించారు. 2024 ఏప్రిల్ నుండి 2025 మార్చి వరకు ప్రతి యూనిట్‌కు 13 పైసల చొప్పున ట్రూడౌన్ చార్జీల సబ్సిడీ గురించి వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో అద్దంకి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మస్తాన్ రావు తన సిబ్బందితో కలిసి పాల్గొన్నారు.