అద్దంకిలో ఆదివారం వేకువజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాత బస్టాండ్ ఎదురుగా నామ్ రోడ్డుపై స్కూటీపై వెళుతున్న దంపతులను వెనుక నుంచి వచ్చిన ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన దంపతులను 108 అంబులెన్స్ ద్వారా అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.