కొరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో ఈనెల 7వ తేదీన శ్రీశ్రీశ్రీ హజరత్ మహబూబ్ సుభాని 31వ ఉరుసు గంధ మహోత్సవ కార్యక్రమం జరగనుంది. కమిటీ సభ్యులు బుధవారం తెలిపిన వివరాల ప్రకారం, ఈ సందర్భంగా జెండా ఊరేగింపు, గంధం పంచుట, ఖురాన్ పఠనం, అన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహించబడతాయి. కులాలకు అతీతంగా ప్రజలందరూ ఈ వేడుకల్లో పాల్గొనాలని వారు కోరారు.