జార్లపాలెం వద్ద రోడ్డు గుంతతో స్థానికుల ఆందోళన

అద్దంకి నుండి రేణింగవరం వెళ్లే రోడ్డులో జార్లపాలెం తర్వాత లెవెల్ చప్టా వద్ద రోడ్డుపై ప్రమాదకరమైన గుంత ఏర్పడింది. సుమారు ఒక అడుగు లోతు, వెడల్పుతో, 20 అడుగుల పొడవున్న ఈ గుంతపై ఆర్&బి అధికారులు దృష్టి సారించడం లేదని స్థానికులు, అద్దంకి పట్టణ ప్రజా సంఘాల నాయకులు మన్నం త్రిమూర్తులు ప్రశ్నిస్తున్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారుల నిర్లక్ష్యంపై వారు మండిపడుతున్నారు.

సంబంధిత పోస్ట్