అద్దంకి: సమస్యపై స్పందించిన ఎండిఓ సింగయ్య

అద్దంకి మండలం కొంగపాడు గ్రామంలో చేతి పంపులు పనిచేయటం లేదని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో సోమవారం ఎండిఓ సింగయ్య పర్యటించారు. చేతిపంపులను ఆయన స్వయంగా పరిశీలించారు. వెంటనే చెడిపోయిన చేతిపంపులను రిపేర్ చేయాలని ఎండిఓ బోరు మెకానిక్ కు సూచించారు. అనంతరం ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్