బాపట్ల పట్టణంలోని ఏఐటియుసి కార్యాలయం వద్ద ఏఐటీయూసీ 106వ ఆవిర్భవ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల శామ్యూల్, సిపిఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ ఏఐటియుసి జెండాను ఎగురవేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఏఐటీయూసీ కార్మిక, కర్షక వర్గాలకు అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏఐటియుసి నాయకులు పాల్గొన్నారు.