బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి 83 అర్జీలు అందాయని, వాటిని చట్ట పరిధిలో విచారించి నిర్దిష్ట గడువులోగా పరిష్కరిస్తామని ఎస్పీ తెలిపారు. అర్జీలు పదేపదే పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిసిఎస్ డిఎస్పి జగదీష్ నాయక్, సిబ్బంది పాల్గొన్నారు.