బాపట్ల పట్టణంలోని 10వ వార్డుకు చెందిన వృద్ధురాలు పెండ్ర కోటమ్మ, బుధవారం మీడియా ద్వారా అధికారులను ఆదుకోవాలని వేడుకుంది. రంగనాయకుల నగర్ లోని చిన్న పూరిగుడిసెలో నివసిస్తున్న ఆమె, గత తుఫాను ప్రభావంతో సర్వం కోల్పోయింది. కుమార్తెలు, కుమారులు, భర్త అందరూ మరణించడంతో, ఒక్క మనువడితో కలిసి భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న కోటమ్మ, వారం రోజులైనా అధికారులు తన వైపు చూడలేదని ఆవేదన వ్యక్తం చేసింది.