బాపట్ల జిల్లా చుండూరు మండలం వలివేరు గ్రామంలో గురువారం మొంథ తుఫాన్ కారణంగా నేలకు ఒరిగిన వరి పైరులను కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. జమలయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగర కొండయ్య పరిశీలించారు. పంటల బీమా వంటి సాకులు చెప్పకుండా, పంట వేసిన రైతులకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా అందించాలని వారు డిమాండ్ చేశారు.