బాపట్ల: విద్యుత్ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలి సిపిఐ

బాపట్ల జిల్లా కలెక్టర్ ఆఫీసులో సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన చిన్నగంజాం మండలం మున్నంగి వారి పాలెం గ్రామానికి చెందిన మార్పు బెన్నును ప్రభుత్వ వైద్యశాలలో సీపీఐ బాపట్ల జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ పరామర్శించారు. సొంత పొలంలో తనకి తెలియకుండా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ బిగించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, బాధితుడికి న్యాయం చేయాలని సింగరకొండ డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్