బాపట్ల: లారీ- ఆటో ఢీ.. ఇద్దరు మృతి

బాపట్ల జిల్లా కారంచేడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, ఆటో ఢీకొన్న సంఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. చీరాల వైపు వెళ్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది. ఈ ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అధికారులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్