బాపట్ల: మద్దినేని వారి పాలెం హైవేపై రోడ్డు ప్రమాదం

బాపట్ల మండలం మద్ధి నేనివారిపాలెం అడ్డరోడ్డు హైవేపై బుధవారం కారు, బైక్ ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రుడిని బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. బాపట్ల రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్