పేదలకు కార్పొరేట్ వైద్యం: ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

రాష్ట్ర ప్రభుత్వం పేదలకు కార్పొరేట్ వైద్యం అందించే లక్ష్యంతో పనిచేస్తోందని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. శుక్రవారం బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని ఇంకొల్లు, పూనూరు గ్రామాలకు చెందిన షేక్ షబానాకు రూ. 50,000, తెలగతోటి శృతికి రూ. 80,000 చొప్పున మంజూరైన చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులైన ప్రతి పేదవాడికి మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తేవడమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు.

సంబంధిత పోస్ట్