వెలగపూడిలో శుక్రవారం నిర్వహించిన ప్రపంచ జనాభా దినోత్సవ ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరై మాట్లాడారు. "గతంలో జనాభా ఎక్కువ ఉన్న దేశాలను చులకనగా చూసేవాళ్లు. ప్రస్తుత పరిస్థితుల్లో జనాభా నియంత్రణ కాదు. నిర్వహణ చేయాలి. ఇప్పుడు జనమే ప్రధాన ఆస్తిగా భావించే రోజులు వచ్చాయి. ప్రత్యుత్పత్తి రేటు 2.1గా ఉంటే జనాభా పెరుగుదల స్థిరంగా ఉంటుంది. మన రాష్ట్రంలో ప్రత్యుత్పత్తి రేటు 1.8గా ఉంది. ఇది మెరుగుపడాలి" అని తెలిపారు.