చిలకలూరిపేట: మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని నియంత్రించాలి

ప్రపంచవ్యాప్తంగా జరిగే రోడ్డు ప్రమాదాలలో 10శాతం పైగా భారతదేశంలోనే జరుగుతున్నాయని సామాజికవేత్త భాను ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణ తేజను చిలకలూరిపేటలో కలిసి, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చేవెళ్లలో ఇటీవల జరిగిన టిప్పర్-బస్సు ప్రమాదం, కర్నూలు బస్సు దహనం వంటి దుర్ఘటనల్లో 20 మందికి పైగా మరణించారని ఆయన గుర్తు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్