చిలకలూరిపేట మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విడదల రజినిపై జరుగుతున్న తప్పుడు ఆరోపణలు, అవాస్తవ ప్రచారంపై వైఎస్సార్సీపీ నాయకులు మంగళవారం తీవ్రంగా స్పందించారు. ఆమె ఆదేశాల మేరకు గ్రామాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రమంలో, రజినిపై రాజకీయ దురుద్దేశంతో బురద జల్లడం సరికాదని సాతులూరు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు స్పష్టం చేశారు. మాజీ మంత్రి రజిని ఆదేశాల మేరకు అన్ని గ్రామాలలో పర్యటిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వారు తెలిపారు.