పంట కాలువలో పడి పూలు కోసే వ్యక్తి మృతి

చీరాల మండలం కొత్తపాలెం పంచాయతీ పరిధిలో దండుబాట స్వర్ణ రోడ్డులోని పంట కాలువలో ప్రమాదవశాత్తు పడి మీసాల ఉమా (32) అనే వ్యక్తి మృతి చెందాడు. కలువ పూలు కోసి అమ్ముకుంటూ జీవనం సాగించే ఉమా, ఆదివారం పూల కోసం వెళ్ళినప్పుడు కాలుజారి కాలువలో పడిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సంఘటన స్థలంలో పూలు కోసే సామాగ్రి లభ్యం కావడంతో, పూల కోసం కాలువలో దిగి మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. ఒన్ టౌన్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్