పోలీస్ అమరవీరుల స్మృతిలో రక్తదాన శిబిరం

బాపట్ల జిల్లాలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా, చీరాల సెయింట్ మార్క్ లూథరన్ చర్చి కమ్యూనిటీ హాల్‌లో పోలీసులు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ దేవరపల్లి దిలీప్ కుమార్ రక్తదానం చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసుల త్యాగాలు స్ఫూర్తిదాయకమని, యువతలో సేవా భావం, దేశభక్తి పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్