చీరాల మండలంలో మొంథా తుఫాను కారణంగా నీట మునిగిన పంట పొలాలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కరణం వెంకటేష్ బాబు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తుఫాను వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, పంట పొలాలు పూర్తిగా నీట మునిగిపోయాయని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని, వ్యవసాయ అధికారులు నిష్పక్షపాతంగా నష్టపోయిన పంటల వివరాలను ప్రభుత్వానికి తెలియజేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.