చల్లారెడ్డి పాలెం వద్ద ఇసుక అక్రమ రవాణా: నాలుగు ట్రాక్టర్లు సీజ్

బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలోని వేటపాలెం మండలం చల్లారెడ్డి పాలెం గ్రామంలో జాతీయ రహదారి 216పై మంగళవారం ఇసుక రవాణా చేస్తున్న నాలుగు ట్రాక్టర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోషల్ మీడియా, మీడియా వార్తాకథనాల నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ దాడులు జరిగినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఆర్డీవోకు నివేదిక అందజేయాలని సూచించారు. రెవెన్యూ సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్