కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం చీరాల మండలం బోయిన వారి పాలెం లోని గంగా పార్వతీ సమేత భోగేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. అర్చకులు వేణు, సాయి తేజ శాస్త్రోక్తంగా అభిషేకాలు, పూజలు నిర్వహించారు. సాయంత్రం లక్షదీపార్చన, జ్వాలాతోరణ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. గ్రామస్తుల సహకారంతో పూజా కార్యక్రమాలు విజయవంతంగా పూర్తయ్యాయి.