తాడేపల్లి పరిధిలోని ప్రకాశం బ్యారేజీకి ఆదివారం రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేయబడింది. ప్రస్తుతం నీటిమట్టం 15 అడుగులకు చేరడంతో, అన్ని గేట్లను పైకెత్తి ఐదు లక్షల 67 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదిలోకి ఎవరూ వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.