గుంటూరు: డయల్ యువర్ కమిషనర్ లో 25 ఫిర్యాదులు

జీఎంసీ కమిషనర్ శ్రీనివాసులు ప్రజాఫిర్యాదులను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించాలని ఆదేశించారు. సోమవారం డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో 25 ఫిర్యాదులు స్వీకరించి, వాటిని సంబంధిత అధికారులకు పంపారు. ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదికలో 39 అర్జీలు స్వీకరించారు. అర్జీల పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డీసీ బి. శ్రీనివాసరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్