గుంటూరు: అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా రాష్ట్ర ముందుకు వెళ్లాలి

గుంటూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదుగుల మాట్లాడుతూ, అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాల ఫలితమే ఆంధ్రప్రదేశ్ అని, తెలుగు రాష్ట్ర ప్రజలంతా ఒకటిగా ఉండాలనే సంకల్పంతో ఆయన పోరాటం చేశారని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్