జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అనారోగ్యంతో వైద్యం చేయించుకునేందుకు అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు. జెడ్పీ చైర్పర్సన్ స్థానికంగా అందుబాటులో లేని సమయంలో వైస్ చైర్మన్కు బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. అయితే, హెనీ క్రిస్టినా బాధ్యతలను ఎవ్వరికీ అప్పగించ లేదు. దీనిపై అధికారులను వివరణ కోరగా చైర్పర్సన్ విదేశాలకు వెళ్లిన విషయం వాస్తవమేనని బుధవారం నాడు తెలిపారు.