గుంటూరులోని ఎన్టీఆర్ మానస సరోవరం పార్కును శుక్రవారం రోజు కేంద్ర సహాయ మంత్రి చంద్రశేఖర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ప్రజలందరూ ఈ ప్రదేశానికి చక్కగా వచ్చారని ప్రభుత్వం మారిన వెంటనే నిర్లక్ష్యాన్ని గురైందని ఆయన అన్నారు. మరలా ఈ పార్కును 20, 30 సంవత్సరాల పాటు ప్రజలందరూ సందర్శించేలాగా మార్చాలి అనుకుంటున్నామని ఆయన మీడియాకు తెలిపారు.