గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఫ్లెక్సీల వివాదం రాజుకుంది. పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, ప్రోటోకాల్ ఉల్లంఘనతో తనకు అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో తన ప్రమేయం లేకుండా బ్యానర్లపై ఎంపీ, ఎమ్మెల్యే ఫోటోలు లేకపోవడంపై ఆమె అధికారులను ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య సమన్వయం లోపించిందని, ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తుఫాను బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో ఈ ఉల్లంఘన జరిగిందని ఆమె పేర్కొన్నారు.