గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి మంగళవారం మహిళా గ్రీవెన్స్ డే నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు హాజరై తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రాలు సమర్పించారు. గడచిన నాలుగు వారాలుగా విజయవంతంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో వందకు పైగా మహిళల నుంచి వివిధ సమస్యలపై వినతులు అందాయని, వాటిలో 60కి పైగా సమస్యలను త్వరితగతిన పరిష్కరించగలిగామని ఎమ్మెల్యే తెలిపారు.