గుంటూరు: కుటుంబ సభ్యులను బెదిరించి దొంగతనం

కొల్లిపర మండలం అత్తోటలో బుధవారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో కృష్ణార్జునరావు ఇంట్లో నలుగురు దుండగులు చోరీకి పాల్పడ్డారు. గోడ దూకి లోనికి ప్రవేశించిన దొంగలు, కుటుంబ సభ్యులను బెదిరించి, ముసుగులు వేసి, బీరువాలో ఉన్న రూ. 5 లక్షల నగదు, రూ. 2 లక్షల విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్