నల్లపాడుకు చెందిన యశస్వి(23) అనే యువతి, ఇంజినీరింగ్ పూర్తి చేసి ప్రస్తుతం ఎస్ఎస్సీ పరీక్షలు రాస్తోంది. రెండుసార్లు పరీక్షలు రాసినా మంచి స్కోర్ రాలేదని మనస్తాపానికి గురై, ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె తల్లి శ్రీలత ఫిర్యాదు మేరకు మంగళవారం నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.