హిమనినగరుకు చెందిన మహేష్ బాబు (27) అనే యువకుడు, తన తండ్రి శంకరరావు వద్ద రూ. 1,50,000 అప్పు ఉందని, దానిని తీర్చడానికి స్థలాన్ని బ్యాంకులో పెట్టాలని కోరాడు. తండ్రి తర్వాత మాట్లాడదామని చెప్పడంతో మనస్తాపం చెందిన మహేష్ బాబు ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తండ్రి శంకరరావు ఫిర్యాదు మేరకు నల్లపాడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.