నరసరావుపేట సత్తెనపల్లి రోడ్లోని స్టేడియాన్ని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఆదివారం పరిశీలించారు. వర్షానికి దెబ్బతిన్న వాకింగ్ ట్రాక్, క్రికెట్, వాలీబాల్ కోర్టులను త్వరగా అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. స్టేడియంలో మెరుగైన సౌకర్యాల కోసం వాకర్స్ నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలని ఆయన కోరారు.