రైతులు వ్యవసాయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు పేర్కొన్నారు. గురువారం నరసరావుపేట మండలం ఇక్కుర్తి గ్రామంలో నిర్వహించిన రామన్న కిసాన్ డ్రోన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రామన్న కిసాన్ డ్రోన్ గ్రూప్ లకు రూ. 9.80 లక్షల విలువైన డ్రోన్ను 80 శాతం రూ. 7.84 లక్షలు సబ్సిడీతో అందించారు.