మాచవరంలో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నామని ఎస్సై తిరుపతిరావు గురువారం తెలిపారు. సినిమా హాల్ సెంటర్ అవుట్కట్స్ లో పేకాట ఆడుతున్న వీరి వద్ద నుంచి రూ. 4, 570 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరిపై కేసు నమోదు చేసి, శుక్రవారం కోర్టులో హాజరుపరుస్తామని ఎస్సై చెప్పారు. గ్రామాల్లో పేకాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.