కారంపూడి: సరదాగా ఈతకు వెళ్లి.. యువకుడు మృతి

శనివారం కారంపూడిలో విషాదం చోటుచేసుకుంది. నరసరావుపేటకి చెందిన ముగ్గురు యువకులు దసరా సెలవులకు కారంపూడిలో ఉన్న తమ పెద్దమ్మ ఇంటికి వచ్చారు. బట్టలు ఉతుక్కునేందుకు వెళ్లిన ఖాదర్ వలీ, నాగూర్ మేరా, సయ్యద్ సత్తార్ లు వినకొండ రోడ్డులోని సాగర్ కుడి కాల్వలో ఈత కొడుతూ మునిగి సయ్యద్ సత్తార్ అనే యువకుడు మృతి చెందాడు. స్థానిక పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్