ఐక్యత ర్యాలీలో మంత్రి సత్య కుమార్ యాదవ్: పటేల్ సేవలు వెలకట్టలేనివి

గుంటూరులో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఐక్యత ర్యాలీని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రారంభించారు. స్వాతంత్ర్యం అనంతరం 565 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి సమైక్యతను తెచ్చిన పటేల్ సేవలను మంత్రి కొనియాడారు. విభిన్న సంస్కృతులున్న భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటారని, హైదరాబాద్ సంస్థానాన్ని పాకిస్థాన్‌లో కలవకుండా రజాకార్లను అణిచివేసి ఉక్కుమనిషిగా నిలిచారని అన్నారు. ఆయన త్యాగాలకు గుర్తుగా ఎన్డీఏ ప్రభుత్వం గుజరాత్‌లో 597 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసిందని, ఆయన జన్మదినాన్ని ఐక్యత దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. వికసిత్ భారత్ ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రతి ఒక్కరూ పటేల్‌ను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్