మొంథా తుఫాన్ నష్టంపై ఎమ్మెల్యే సమీక్ష: 20 వేల ఎకరాల పంట నష్టం

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో మొంథా తుఫాన్ వల్ల జరిగిన నష్టాలను అంచనా వేయడానికి ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ తుఫాన్ వల్ల 20 వేల ఎకరాల్లో పంట నష్టం, రోడ్లు, ఎలక్ట్రికల్ పోల్స్ దెబ్బతిన్నాయని తెలిపారు. లక్షా 62 వేల మందికి పునరావాసం కల్పించి, ప్రభుత్వం తరపున పరిహారం అందజేస్తామని ఎమ్మెల్యే రామాంజనేయులు స్పష్టం చేశారు. కోటి రూపాయల నిధులతో రహదారులను అభివృద్ధి చేస్తామని, నష్టం అంచనాలో లోపం లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్