గురజాల రెవెన్యూ డివిజన్ అధికారి వి. మురళికృష్ణ, మంగళవారం గురజాలలోని ఆర్డిఓ కార్యాలయంలో పల్నాటి వీరుల ఉత్సవాల ఏర్పాటుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 19 నుండి 23వ తేదీ వరకు జరిగే కారంపూడి వీరుల ఉత్సవాలను అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, ఆచారవంతుల సమన్వయంతో ఘనంగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ఈ ఉత్సవాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన కోరారు.