మాచర్ల పట్టణంలో ట్రాఫిక్ సమస్యలను నివారించేందుకు అర్బన్ సీఐ వెంకటరమణ ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రధాన రహదారులపై వాహనాలు అడ్డంగా నిలపడం, అనధికారిక పార్కింగ్ వల్ల ఏర్పడే ఇబ్బందులను నివారించడానికి ముందుగా ప్రజలను మీడియా ద్వారా అప్రమత్తం చేశారు. అనంతరం ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే వాహనదారులపై పోలీసులు చర్యలు తీసుకున్నారు.