చిలకలూరిపేట మున్సిపల్ వైస్ చైర్మన్, వైస్సార్సీపీ సీనియర్ నాయకుడు వలెటి వెంకటేశ్వరరావు మంగళవారం చిలకలూరిపేట వైస్సార్సీపీ కార్యాలయంలో మాట్లాడుతూ, నాయకులను, కార్యకర్తలను మోసం చేసే ఘనత తెలుగుదేశం పార్టీ వారికే ఉందని, వైస్సార్సీపీ పార్టీ నేతలకు ఆ అవసరం లేదని తెలిపారు. వైస్సార్సీపీ హయాంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేశారని కొందరు వ్యక్తులు SP కార్యాలయంలో ఫిర్యాదు చేసినా, అది నాటకమని వారు కొట్టిపారేశారు. 5 కోట్ల రూపాయలు తీసుకొని ఉద్యోగం ఇప్పిస్తామని వైస్సార్సీపీ నాయకులు అన్నారనే ఆరోపణలు సమంజసం కాదని, దొంగ ఉద్యోగాలు ఇప్పించి యువత జీవితాలతో ఆడుకోవాల్సిన దుస్థితి తమ నాయకురాలు విడదల రజినికి లేదని, తెలుగుదేశం పార్టీ నేతలు కావాలనే ఆమెపై దుమ్మెత్తి పోస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ సమావేశంలో చిలకలూరిపేట మండల అధ్యక్షుడు దేవినేని శంకర్ రావు, నాదెండ్ల వైస్సార్సీపీ నాయకులు శ్రీనివాసరావు, తాళ్ల అంజిరెడ్డి, కొప్పురావురి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.