విజ్ఞాన్ యూనివర్సిటీలో ప్రవేశాలకు విసాట్ నోటిఫికేషన్ విడుదల

గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలోని చేబ్రోలు మండలం వడ్లమూడిలో ఉన్న విజ్ఞాన్ యూనివర్సిటీలో ప్రవేశాలకు విసాట్ నోటిఫికేషన్ బుధవారం విడుదలయ్యింది. వైస్ చాన్స్లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ. నాగభూషణ్ మాట్లాడుతూ ఉద్యోగాలు, పరిశోధనలకు యూనివర్సిటీ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. బీటెక్/బీఫార్మసీ ప్రవేశ పరీక్ష మార్చి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు జరుగుతుంది. వీశాట్-2026 దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 25. దేశవ్యాప్తంగా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు, ప్రతిభావంతులకు స్కాలర్షిప్లు అందిస్తారు. దరఖాస్తులు యూనివర్సిటీ వెబ్సైట్ www.vignan.ac.in ద్వారా ఆన్లైన్లో చేసుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్