మంగళగిరి: 4వేల మందికి పైగా కలిసి సమస్యలు తెలుసుకున్న మంత్రి

మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మంత్రి నారా లోకేష్ 70వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చి తమ సమస్యలను మంత్రికి విన్నవించుకున్నారు. దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో 4 వేలమందికి పైగా ప్రజలు మంత్రిని కలిసి తమ విజ్ఞప్తులను సమర్పించారు. ప్రతి విజ్ఞప్తిని పరిశీలించి, సిబ్బందికి ఆదేశాలు జారీ చేసిన మంత్రి, కూటమి ప్రభుత్వంలో అందరికీ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్