నరసరావుపేట టూటౌన్ సీఐగా ప్రభాకర్ శుక్రవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. శాంతిభద్రతల విషయంలో రాజీలేకుండా పనిచేస్తానని, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టిసారిస్తామని ఆయన స్పష్టం చేశారు. మట్కా, గుట్కా, పేకాట, ఇసుక అక్రమ రవాణా వంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తేలేదని ప్రభాకర్ హెచ్చరించారు. పలువురు సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు.