పర్చూరు మండలం అన్నంబోట్ల వారిగ్రామంలో గురువారం ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కలిసి వరద కాలువను పరిశీలించారు. వరద తీవ్రత, గ్రామంలోకి నీరు వెళ్లకుండా తీసుకున్న చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉధృతి తగ్గేవరకు ప్రజలకు అందుబాటులో ఉండాలని, సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.