గురువారం, 'మొంథా' తుఫాన్ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న పంటపొలాలను పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ప్రత్యక్షంగా పరిశీలించారు. ఉంగుటూరు-కంభంపాడు ప్రాంతాల మధ్య నీటమునిగిన పొలాలను సందర్శించి, రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకునేలా తక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు.