పెదకూరపాడు మండలం లగడపాడు గ్రామంలోని మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధానోపాధ్యాయులు నండూరి సురేష్, సహా ఉపాధ్యాయులు పాటిబండ్ల శిరీష ఆధ్వర్యంలో పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతీయ ఐక్యతా దినోత్సవం, పటేల్ గొప్పతనం గురించి విద్యార్థులకు వివరించారు. అనంతరం జాతీయ ఐక్యత దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ మేనేజర్ గంగాధర్, పూర్వ విద్యార్థి చిల్లపల్లి సత్యం పాల్గొని, దేశాన్ని ఐక్యం చేయడంలో పటేల్ పాత్రను కొనియాడారు. విద్యార్థులకు పెన్నులు బహుకరించారు.