కాకాని మండలంలోని వెనిగండ్ల, నంబూరు, తక్కెళ్ళపాడు, ఉప్పలపాడు గ్రామాల్లో తుఫాను వల్ల నష్టపోయిన 331 నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం తరఫున తక్షణ అవసరాల కోసం నిత్యావసర సరుకులు, ఒక్కో కుటుంబానికి వెయ్యి రూపాయల చొప్పున పంపిణీ చేశారు. పొన్నూరు శాసనసభ్యులు దూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రతి కుటుంబానికి నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో, ఎండిఓతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా పాల్గొన్నారు.